ఓయూలో పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

by Nallavelli.Anjaneyulu |

ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఓయూలో పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. సిలబస్ పూర్తి కాలేదని పేర్కొంటూ గత రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం విద్యార్థి ప్రతినిధులు, ఆయా విభాగాల డీన్లతో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ వేర్వేరుగా సమావేశమై చర్చించారు. విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. వాయిదా పడిన పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

Next Story