ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో పోలీసుల నిఘా.. బ్లాక్ టికెట్ల దందాపై స్పెషల్ ఫోకస్

by Kema Shiva Kumar |

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ మ్యాచ్‌ వేళ బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో పోలీసుల నిఘా.. బ్లాక్ టికెట్ల దందాపై స్పెషల్ ఫోకస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్లేఆఫ్స్‌కు ముందు రాత్రి 7.30కి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంచర్స్ బెంగళూరు జట్టు తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే బ్లాక్‌ టికెట్ల విక్రయంపై స్టేడియం పరిసరాల్లో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి మఫ్టీలో తిరుగుతున్నారు. నిన్న సాయంత్రం స్టేడియం బయట టికెట్లు లేని వారు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు టికెట్లు కావాలా..? అని ఆశపెడుతూ బ్లాక్‌ ముఠా టికెట్లు విక్రయిస్తున్నారు. రూ.3,500 టికెట్ బ్లాక్‌లో ఏకంగా రూ.10 వేలకు అమ్ముడుపోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story