- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంకిత భావం, నిబద్ధతతో పోలీసుల సేవలు.. 446 అధికారులకు రివార్డ్స్
మనమందరం కలిసి పని చేయడం వల్లే హైదరాబాద్ సిటీ లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పోలీసు కమిషనర్, డిజి సీవీ ఆనంద్ అన్నారు.

దిశ, సిటీక్రైం : మనమందరం కలిసి పని చేయడం వల్లే హైదరాబాద్ సిటీ లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పోలీసు కమిషనర్, డిజి సీవీ ఆనంద్ అన్నారు. 80 లక్షల జనాభా ఉన్న నగరంలో పోలీసులు నిరంతరం కృషి చేయడం వల్ల హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆరు నెలలు గా పోలీసు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 446 మంది పోలీసు అధికారులకు రివార్డ్స్ సర్టిఫికేట్ లను సీపీ సీవీ ఆనంద్ అందించారు. కేసుల పరిష్కారంలో ఆలస్యం చేయకుండా పని చేస్తున్న ప్రతి సిబ్బంది, అధికారులను సీపీ ప్రశంసించారు. పోలీసులు సమర్ధవంతంగా నిర్వహిస్తున్న విధులతో క్షేత్ర స్థాయిలో నేరాలు తగ్గాయన్నారు. 24/7 వ్యాపారాలు నడుస్తుండడంతో పాటు ప్రజలు నిర్భయంగా అర్ధరాత్రి సమయాల్లో కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారని సీపీ తెలిపారు. ఏసీపీలు-2, ఇన్స్ పెక్టర్ లు-49, ఎస్ఐ లు-38, ఏఎస్ఐ లు-21, హెడ్ కానిస్టెబుళ్లు-30, పోలీసు కానిస్టెబుళ్లు-220, హోంగార్డులు-11, మినిస్టిరియల్ సిబ్బంది-45, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు-25, మంది మొత్తం 446 అధికారులకు సీపీ సీవీ ఆనంద్ రివార్డ్స్ ను శుక్రవారం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో అందించారు.
- Tags
- Police service






