- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిడ్నాప్ కి గురైన చిన్నారిని గంటల్లోనే రక్షించిన పోలీసులు
by Ratna Kumari |
కిడ్నాప్ కి గురైన చిన్నారిని గంటల్లోనే రక్షించారు పోలీసులు. ఈ ఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, కార్వాన్ : కిడ్నాప్ కి గురైన చిన్నారిని గంటల్లోనే రక్షించారు పోలీసులు. ఈ ఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మేడిపల్లికి చెందిన సల్మాన్ తస్లీమ్ తన రెండేళ్ల కుమార్తెతో కలిసి యూసుఫైన్ దర్గా వద్ద ఉండగా.. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ పాపను అపహరించుకుపోయాడు. బాధితురాలు వెంటనే 'డైల్-100' కు సమాచారం అందించగా, హబీబ్‌నగర్ పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ టీవీ కెమెరాల ఆధారంగా కర్ణాటక రాష్ట్రం, బసవకల్యాణ్‌కు చెందిన షేక్ జహంగీర్ (35) గా గుర్తించారు. నిందితుడు పాపతో పాటు పురాణాపూల్ వెళ్లినట్లు గుర్తించి అరెస్ట్ చేసి పాపను సురక్షితంగా తల్లితండ్రులకు అప్పగించారు.
Next Story






