శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ ఫ్లాగ్ మార్చ్

by velandi.Saikiran |

శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈస్ట్ జోన్ డీసిపి డాక్టర్ బి బాలస్వామి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గణపతి నిమర్జన

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ ఫ్లాగ్ మార్చ్
X

దిశ, అంబర్ పేట: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈస్ట్ జోన్ డీసిపి డాక్టర్ బి బాలస్వామి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గణపతి నిమర్జన సందర్బంగా శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ బి బాలస్వామి తెలిపారు. బుధవారం ఈస్ట్ జోన్ డీసిపి డాక్టర్ బి బాలస్వామి ఆధ్వర్యంలో దాదాపు పోలీస్ 300 మంది సాయుధ బలగాలతోటి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఆఫ్జాల్ గంజ్ నుంచి మొజంజాహి మార్కెట్ మీదుగా ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్బంగా ప్రజల్లో ధైర్యం నింపడానికే పోలీస్ ఫ్లాగ్ మార్చ్ అని, ప్రజల భద్రతే ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు, ప్రజలకు నిత్యం అందుబాటులో పోలీసులు ఉంటారని భరోసా కల్పించడానికి, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని ఫోర్స్ లతో కలిపి సుమారు 1000 మంది బలగలాతో భద్రత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ బి బాలస్వామి, అడిషనల్ డిసిపి జె నరసయ్య, ఏసిపి ఎమ్ మట్టయ్య, కాచిగూడ ఏసిపి హరీష్ కుమార్, కాచిగూడ సిఐ టీ. జ్యోత్స్న, కిసర సిఐ ఆనందరావు, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఆఫ్జాల్ గంజ్ ఎస్ఎచ్ఓ లు, కాచిగూడ ఎస్ఐ నరేష్, కృష్ణవేణి, భరత్, శ్రీకాంత్, సాయి గణేష్, సాహిద్ అలీ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story