- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన చర్య..
రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే విధంగా నిర్లక్ష్యంగా, అతి వేగంగా ఆటో నడిపిన ఓ డ్రైవర్‌పై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, చంపాపేట్: రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే విధంగా నిర్లక్ష్యంగా, అతి వేగంగా ఆటో నడిపిన ఓ డ్రైవర్‌పై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, సదరు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగే పరిస్థితులు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 125తో పాటు మోటారు వాహనాల చట్టం సెక్షన్ 184 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే విధంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ గోపి నాథ్ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు సంభవించి అమాయకుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.






