- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్వాడీల వస్తువులను బాయ్ కాట్ చేయాలి
మార్వాడీల వస్తువులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి.

దిశ, హిమాయత్ నగర్: మార్వాడీల వస్తువులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి. తెలంగాణలో వ్యాపారం చేస్తున్న మార్వాడీలు గంజాయి, హెరాయిన్, మారణాయుధాలను విక్రయిస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రతి నెల రెండు వందల కోట్ల రూపాయలను గుజరాత్, రాజస్థాన్లకు తరలిస్తున్నారని పిడమర్తి రవి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉత్తరాది కల్తీ వ్యాపారాలకు వ్యతిరేకంగా 'తెలంగాణ బచావో మూమెంట్' (టీబీఎం) (మన రాష్ట్రం-మన దుకాణం)ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గుజరాత్, రాజస్థాన్ల వారికి మద్దతు ఇస్తూ, సమాజంపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ఆయన వ్యాఖ్యలన్ని అబద్ధాలేనని రవి ఆరోపించారు. ఈ ఉద్యమం పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని, లోకల్ వ్యాపారాలు స్థానికులే చేసుకోవాలని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికులు 80 శాతం వ్యాపారాలు చేసుకునే విధంగా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన జేఏసీ ఛైర్మన్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ మార్వాడీలు మనువాదులని, మర్వాడీలు హాటావో తెలాంగాణ బచావో ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రముఖ గాయకుడు మాస్టార్టీ, తెలంగాణ ఉద్యమకారులు కరాటే శ్రీహరి, పెద్ద ఎత్తున వ్యాపారులు పాల్గొన్నారు.






