హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం

by Kema Shiva Kumar |

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేయాలనుకుంటున్న వారికి బిగ్ అలర్ట్. ఆర్ట్స్, సైన్స్, టెక్నికల్ కోర్సుల్లో 1,400 పైగా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2026–27 విద్యాసంవత్సరానికి గాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక పోర్టల్ https://acad.uohyd.ac.in/ ద్వారా జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ వర్గాలు తెలిపాయి. మెజారిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను సీయూఈటీ-పీజీ (CUET-PG) స్కోర్ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను పరిశీలిస్తే.. కోర్ పీజీ కోర్సులైన ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంపీఏ, ఎంవీఏ, ఎంబీఏలు మొత్తం కలిపి 1,295 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎంటెక్ (మైక్రోఎలక్ట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్) 36, ఎంసీఏ 40, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో 29 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోఇన్ఫర్మేటిక్స్ వంటి స్పెషలైజ్డ్ టెక్నికల్ కోర్సుల్లోని 100 ఎంటెక్ సీట్లను గేట్ (GATE) స్కోర్ ఆధారంగా సీసీఎంటీ (CCMT) కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇంటిగ్రేటెడ్ పీజీ ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీయూఈటీ-యూజీ (CUET-UG) ఫలితాలు విడుదలైన తర్వాత ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Next Story