ఆయన దెబ్బకు ‘OG’ డ్రెస్‌తో కనిపించిన పవన్

by Vemula.Srinu Prasad |

‘OG’ దర్శకుడు సుజీత్ వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్లాక్ డ్రెస్‌లో హాజరయ్యానని పవన్ కల్యాణ్ తెలిపారు..

ఆయన దెబ్బకు ‘OG’ డ్రెస్‌తో కనిపించిన పవన్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) నటించిన ‘OG’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ ఎల్బీస్టేడియం(Hyderabad LB Stadium)లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు సుజిత్‌తో పాటు ఇతన నటులు సైతం పాల్గొన్నారు. కత్తితో స్టైజ్ పైకి వచ్చి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను దిల్ ఖుష్ చేశారు. అలాగే సినిమాలోని డైలాగులు చెప్పి రంజింపజేశారు. పవన్ డైలాగులతో ఎల్బీస్టేడియం దద్దరిల్లిపోయింది. ఫ్యాన్ కేరింతలు ఆకాశాన్ని తాకాయి. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ దర్శకుడు సుజిత్ దెబ్బ(Director Sujith)కు తామంతా సినిమాలో వాడిన డ్రెస్‌తోనే ఈ ఈవెంట్ వచ్చామని తెలిపారు. దర్శకుడు సుజిత్ తన వీరాభిమానని, జానీ సినిమా చూసి హెడ్ బ్యాండ్ పెట్టుకుని నెల రోజులు తిరిగారని తెలిపారు. దానయ్య ద్వారా సుజీత్ తనకు పరిచయం అయ్యారని చెప్పారు. కథ ముక్కలుగా చెబుతారని, కానీ తీసేటప్పుడు అతని సత్తా తెలిసిందని పవన్ పేర్కొన్నారు. ఈ సినిమా తాను స్టార్ కాదని, డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Music Director Taman) అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Next Story