- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYDRA : హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పాలాభిషేకం
by Muthe.Rajitha |
హైడ్రా(HYDRA) మరోసారి కొరడా ఝుళిపించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(HYDRA) మరోసారి కొరడా ఝుళిపించింది. మంగళవారం బడంగ్ పేట్(BadangPet) మున్సిపాలిటీ పరిధిలోని పార్కు స్థలాలను పరిశీలించింది. వెంకటేశ్వర కాలనీలో ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని అధికారులు గుర్తించారు. స్థలంలోని అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. అయితే పార్కు స్థలాన్ని కబ్జా చేశారని రెండు రోజుల క్రితమే కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissionor RangaNath) కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి.. అధికారులతో విచారణ జరిపించారు. పార్కు స్థలం ఆక్రమనకు గురైనట్టు తేల్చి, చర్యలు చేపట్టారు. కాగా ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే అధికారులు చర్యలు తీసుకొని, పార్కు స్థలాన్ని కాపాడినందుకు వెంకటేశ్వర కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పాలభిషేకం చేశారు.
Next Story






