మాకు అండగా ఉన్న ఒక్క కొడుకుని హత్య చేశారు

by Ratna Kumari |

ఇటీవల సీతాఫలమండీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన యువన్ అలియాస్ అఖిల్ కుటుంబ సభ్యులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆదివారం పరామర్శించారు.

మాకు అండగా ఉన్న ఒక్క కొడుకుని హత్య చేశారు
X

దిశ, సీతాఫలమండీ: ఇటీవల సీతాఫలమండీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన యువన్ అలియాస్ అఖిల్ కుటుంబ సభ్యులను సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆదివారం పరామర్శించారు. నామలాగుండు లోని వారి నివాసానికి వెళ్లిన ఆయన మృతుడి తల్లిదండ్రులు దుర్గ, శ్రీనివాస్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు మాకు అండగా ఉన్న ఒక్క కొడుకుని హత్య చేశారు. ఇప్పుడు మా కుటుంబానికి దిక్కెవరు..?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వారి బాధను చూసి అక్కడి వాతావరణం భావోద్వేగంగా మారింది. హత్య సంఘటన అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పద్మారావు గౌడ్ తెలిపారు. కుటుంబ సభ్యులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన కేసు పురోగతిని ఆరా తీశారు. నిందితులను త్వరగా అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పిన పద్మారావు గౌడ్, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము వెన్నంటి ఉంటామని స్పష్టం చేశారు.

Next Story