ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుప‌త్రి మెడికో బ‌లి

by Ratna Kumari |

ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుపత్రి మెడికల్ విద్యార్థి బలి అయ్యాడు.

ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుప‌త్రి మెడికో బ‌లి
X

దిశ‌, కార్వాన్ : ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుపత్రి మెడికల్ విద్యార్థి బలి అయిన ఘటన తెలిసిన విషయమే. కుల రిజర్వేషన్ వల్ల పీజీ సీటు వచ్చిందని వేధిస్తూ కావాలనే అధిక డ్యూటీలు వేస్తున్నారని జడ్చర్ల పరిధిలోని పాల్గడ్డ తండాకు చెందిన కాట్రావత్ సురేష్ నాయక్ అనే మెడికో గిరిజన పీజీ విద్యార్థి తన తల్లి నాగమణికి చెప్పి బాధపడినట్లు సమాచారం. ఇదే విషయం పై నాగమణి సోదరుడు రవి హాస్టల్ వద్దకు చేరుకుని సురేష్ కి ధైర్యం చెప్పి, ర్యాగింగ్ చేస్తున్న వారిని కలిసి మాట్లాడతానని చెప్పాడు. తాను చూసుకుంటాను మీరు రాకండి అని సురేష్ నాయక్ తెలిపినట్లు సమాచారం. సురేష్ మృతికి కారణమైన వారిపై హత్యకేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సురేష్ నాయక్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Next Story