- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైటెక్స్‌లో కొనసాగుతున్న పెటెక్స్ షో
మాదాపూర్ హైటెక్స్ ఎక్సబిషన్ సెంటర్‌లో పెటేక్స్ ఇండియా షో రెండో రోజు ఉత్సాహంగా సాగుతుంది.

దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్ హైటెక్స్ ఎక్సబిషన్ సెంటర్‌లో పెటేక్స్ ఇండియా షో రెండో రోజు ఉత్సాహంగా సాగుతుంది. యానిమల్ లవర్స్ తమ పెట్స్‌తో షోకు వచ్చి డాగ్ కాంపిటీషన్, క్యాట్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన కుక్కలు, పక్షులు, ఇతర జంతువులు ఈ షో లో పాల్గొంటాయి. జర్మన్ షెపర్డ్ లతో పాటు రేర్ డాగ్ బీడ్స్ అయిన ముదోలాన్, పిప్పట్, రాషన్, అఫినోవా జాతికి చెందిన డాగ్స్, దేశ విదేశాలకు చెందిన పిల్లులు, పక్షులు, చేపలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
వీటిని చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా మాట్లాడే పక్షులు ఉండడంతో షో మరింత ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే డాగ్స్‌కు పోటీలు నిర్వహించి అందులో విజేతలుగా నిలిచే డాగ్స్ యజమానులకు బహుమతులు అందజేశారు. కుక్కలు, పిల్లులు, పక్షులకు సంబంధించిన ఆహారం, ఇతర సామాగ్రి కూడా పెటెక్స్ ఎగ్జిబిషన్ షో లో అందరిని ఆకట్టుకుంటున్నాయి.






