సృష్టి ఆసుపత్రిలో తీగ లాగితే గాంధీలో డొంక కదులుతోంది

by Muthe.Rajitha |

సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

సృష్టి ఆసుపత్రిలో తీగ లాగితే గాంధీలో డొంక కదులుతోంది
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే అక్రమ సరోగసీ, స్పెర్మ్ ట్రాఫికింగ్ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తీగ లాగితే డొంక కదిలినట్టూ... సృష్టి ఆసుపత్రి వెనుక పలు పెద్ద ఆసుపత్రులు కూడా తెలుస్తోంది. ఈ కేసులో గాంధీ ఆస్పత్రి వైద్యుడికి లింకులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో అనస్థీషియా స్పెషలిస్ట్‌గా ఉన్న డాక్టర్‌ సదానందంను అరెస్ట్‌ చేసారు. గత కొంతకాలంగా సృష్టి యజమానితో కలిసి అక్రమ సరోగసి చేస్తున్నట్లు నిర్దారించారు. డాక్టర్‌ సదానందంను అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే క్లినిక్ యజమాని డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లతోసహా ఏడుగురు ఇతర వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్టు డీసీపీ రష్మి పెరుమాళ్‌ పేర్కొన్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓ దంపతులు సికింద్రాబాద్‌లోని సృష్టి క్లినిక్ ద్వారా సరోగసీ ప్రక్రియలో జన్మించిన బిడ్డ వారికి సంబంధం లేదని డీఎన్ఏ పరీక్షల ద్వారా తేలడంతో ఈ రాకెట్ బట్టబయలైంది. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

Next Story