- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎండలో బెంచ్ పై కోడిగుడ్డుతో ఆమ్లెట్..!
by Ratna Kumari |
రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

X
దిశ, మంథని : రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.పెద్దపల్లి జిల్లాలో మండుతున్న ఎండల తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో చూపించడానికి కొందరు యువకులు ఇవాళ ఓ వినూత్న ప్రయత్నం చేశారు. మంథని పట్టణం శ్రీపాద కాలనీలో మండుతున్న ఎండలో కూర్చుని ఓ బెంచ్ పై కొందరు యువకులు కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసి ప్రయోగం చేయడం పట్ల స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మంథనిలో మధ్యాహ్నం సమయంలో సుమారు 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంది. రోడ్డు ఉపరితలం వేడెక్కింది. దీంతో యువకులు వినూత్న ప్రయోగం చేశారు. ఎండ వేడి ఎలా ఉందో చూయించడానికి స్థానిక యువకులు రోడ్డు పై గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేసి చూయించారు. కొద్ది నిమిషాల్లోనే గుడ్డు ఉడికిపోవడంతో స్థానిక ప్రజను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎండ వేడిమి తగ్గే వరకు కొద్దీ జాగ్రత్తలు వైద్యులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
Next Story






