- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబస్తీ అగ్నిప్రమాదం.. మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా : భట్టి విక్రమార్క
పాతబస్తీలో జరిగిన దారుణ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 17 మందికి పోస్టుమార్టం పూర్తి అయింది.

దిశ, కార్వాన్ : పాతబస్తీలో జరిగిన దారుణ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 17 మందికి పోస్టుమార్టం పూర్తి అయింది. మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా బాధితుల నివాసాలకు పోలీసులు తరలించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఉదయం 6:16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్‌కు సమాచారం అందగా, వెంటనే 11 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న డీఎఫ్ఓ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మొదటి నిమిషం నుండి సమీక్ష చేస్తుండగా, ప్రభుత్వం ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. 17 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు.






