- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎంపీ లక్ష్మణ్
బీసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ దిశగా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు,ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

దిశ, బేగంపేట : బీసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ దిశగా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు,ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘంలో జరిగిన కులగణన పై బీసీ సంఘాల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పార్టీలో బీసీలకు సముచిత -ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఏ రకంగా అయితే హక్కులు కల్పించారో కులగణన ద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బీసీలకు ఆ హక్కు కల్పించను న్నారని తెలియజేశారు.
ఇటీవల రేవంత్రెడ్డి సర్కారు చేసిన కులగణన తప్పుల తడక అని ఎద్దేవా చేశారు. 2027లో జనగణనతో పాటు కులగణనను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.పేదల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు దళారీలు లేకుండా రూ.30లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాలోకి పడుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ మహిళా బిల్లుతో పాటు అసాధ్యం కాని వాటిని సుసాధ్యం చేస్తున్నారని వివరించారు. అట్ట డుగు వర్గాల అభ్యున్నతితో పాటు దేశాన్ని అన్నిరం గాల్లో ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నదని తెలియజేశారు.
బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, శ్యాంసుందర్ గౌడ్,మేకల సారంగపాణి,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్,ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చీర శ్రీకాంత్,పీఎల్ శ్రీని వాస్,మంత్రి కళావతి, కార్పొరేటర్ కొంతం దీపికా,భానుకా మల్లికార్జున్,కృష్ణమూర్తి, నగేష్,నెమలి ఆనంద్,సందీప్ వర్మ,హరి,బి ఎన్ శ్రీనివాస్,ప్రతాప్ తోపాటు పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.






