- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Smitha Sabharwal : స్మితా సభర్వాల్ కు నోటీసులు!
ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్(Smitha Sabharwal) కు నోటీసులు జారీ చేయనుంది జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ(Jayashankar Agriculture University).

దిశ, వెబ్ డెస్క్ : ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్(Smitha Sabharwal) కు నోటీసులు జారీ చేయనుంది జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ(Jayashankar Agriculture University). వర్శిటీ నుంచి వాహన రెంట్ నిధులు తీసుకోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం తెలిపింది. తిరిగి ఆ అద్దె డబ్బులు ఇవ్వాలని నోటీసులు ఇచ్చేందుకు వర్శిటీ అధికారులు నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో న్యాయ నిపుణుల సలహా తీసుకొని చర్యలు తీసుకుంటామని ఆడిట్ అధికారులు తెలియజేశారు. సీఎంవో అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా సభర్వాల్ 2016 నుంచి 2024 వరకు మొత్తం 90 నెలల కాలానికి రూ.61 లక్షలు వాహన అద్దె కింద తీసుకున్నారు. వర్శిటీ ఆడిటింగ్ లో ఈ విషయం వెలుగులోకి రావడంతో తిరిగి అవి రాబట్టేందుకు నోటీసులకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఆడిటింగ్ అధికారులు చెబుతున్న విషయం నిజమేనని వర్శిటీ అధికారులు కూడా ధృవీకరించినట్టు సమాచారం. కాగా ఈ వ్యవహారంపై స్మితా సభర్వాల్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.






