- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Family Quarrels : మనోజ్ పై సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్ బాబు
మంచు ఫ్యామిలీ(Manchu Family Issue)లో ట్విస్టులు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మంచు ఫ్యామిలీ(Manchu Family Issue)లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇదివరకే వీరి కుటుంబ గొడవలు హాట్ టాపిక్ గా మారగా.. తాజాగా ఆదివారం వీరి మధ్య గొడవలు తార స్థాయికి చేరుకున్నారు. నిన్న ఉదయం మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj) ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు తన తండ్రి రౌడీలను పంపి తనను, తన భార్యను కొట్టించాడని మనోజ్ ఫిర్యాదు చేయగా.. మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. కాగా ఆదివారం సాయంత్రం నడవలేని స్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మనోజ్ జాయిన్ అవగా.. ఆయన ఒంటిపై గాయాలు అనుమానస్పదంగా ఉన్నాయని ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇదిలా ఉండగా.. నేడు ఈ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. తన తండ్రి వల్ల తనకు, తన భార్య బిడ్డలకు ప్రాణహాని ఉందని, తమను రక్షించాలని కోరుతూ సోమవారం సాయంత్రం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్(Pahadi Sharif PS) కు వెళ్ళి మనోజ్ లిఖిత పూర్వక కంప్లైంట్ ఇచ్చారు. ప్రతిగా తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక వలన తనకు ప్రాణహాని ఉందని రాచకొండ సీపీ(Rachakonda CP)కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
Read More...






