మౌనిక మృతదేహన్ని ఫ్లెక్సీలో తీసుకువెళ్లడంపై నెటిజన్ల ఆగ్రహం

by Disha Web Desk 6 |
మౌనిక మృతదేహన్ని ఫ్లెక్సీలో తీసుకువెళ్లడంపై నెటిజన్ల  ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి చిన్నారి మౌనిక మృతి ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్షం నీళ్లలో నాలలో కొట్టుకుపోయిన మౌనిక మృతదేహాన్ని తరలింపు విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్క్ లైన్ వద్ద డీఆర్ఎఫ్ సిబ్బంది మౌనిక మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ మార్చూరికి తరలించారు. అయితే మౌనిక మృతదేహాన్ని స్ట్రెచర్‌పై కాకుండా ఓ ఫ్లెక్సీలో వేసి తీసుకువెళ్లడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

చనిపోయిన వారికి కూడా ప్రాథమిక గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని కానీ ఇక్కడ మాత్రం మృతదేహాన్ని తరలించడానికి డీఆర్ఎఫ్ సిబ్బందికి స్ట్రెచర్ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ట్వీట్‌కు ట్యాగ్ చేస్తూ మండిపడుతున్నారు. మీరంతా తాగే నీరు కూడా ప్యాక్ చేసిన వాటర్ బాటిళ్ల నుంచి తాగుతారు కానీ పౌరులకు కనీస సౌకర్యాలు కల్పించలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా డీఆర్ఎఫ్ వాహనానికి స్ట్రెచర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed