- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లండన్ బాబుల డ్రగ్స్ దందా.. ఐదుగురు అరెస్ట్..
లండన్ బాబు చెప్పితే బెంగళూరులో ఎండిఎంఏ డ్రగ్స్ ను విక్రయించే అడ్డా ఆచూకీ దొరికింది. ఆ లింక్ తో హైదరాబాద్ కు చెందిన యువకులు 3 నెలల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్ళి ఎండిఎం డ్రగ్స్ తో పాటు ఓజీ(హైడ్రో ప్రోనిక్ గంజాయి) గంజాయిని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తు వారు కూడా మత్తులో ఊగిపోతున్నారు.

దిశ, సిటీక్రైం : లండన్ బాబు చెప్పితే బెంగళూరులో ఎండిఎంఏ డ్రగ్స్ ను విక్రయించే అడ్డా ఆచూకీ దొరికింది. ఆ లింక్ తో హైదరాబాద్ కు చెందిన యువకులు 3 నెలల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్ళి ఎండిఎం డ్రగ్స్ తో పాటు ఓజీ(హైడ్రో ప్రోనిక్ గంజాయి) గంజాయిని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తు వారు కూడా మత్తులో ఊగిపోతున్నారు. ఈ లింక్ ను హైదరాబాద్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ విభాగం అధికారులు చేధించారు. ఎస్టీఎఫ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన వరుణ్, ప్రభు చైతన్య లు లండన్ లో మాస్టర్స్ చేసి 3 నెలల కిందట నగరానికి వచ్చారు. డ్రగ్స్ మత్తులో ఊగిపోవాలని భావించి లండన్ లో ఉన్న వంశి ని సంప్రదించారు. అతను బెంగళూరులో ఉండే ఓ నైజీరియన్ అడ్డాకు సంబంధించిన ఆచూకీని ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి వరుణ్ , ప్రభు చైతన్యలు తన మరో స్నేహితుడు కిరణ్ కుమార్ ను బెంగళూరు నైజీరియన్ అడ్డాకు పంపంచి అక్కడి నుంచి ఎండిఎంఏ , ఓజీ గంజాయిని తీసుకువస్తున్నారు. వాటిలో కొంత డ్రగ్స్ ను స్థానికంగా ఉండే కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అమ్ముతున్నారు.
ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు మంగళవారం సాయంత్రం సమయంలో కూకట్ పల్లి వివేకానందనగర్ కు వెళ్ళారు. అక్కడ మాటు వేసి వరుణ్, కిరణ్ కుమార్, ప్రభు చైతన్యలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు ఎస్టీఎఫ్ అధికారుల పై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎక్సైజ్ అధికారులు వారిని వదలకుండా పట్టుకుని ముగ్గురి నుంచి 2.56 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 38.56 గ్రాముల ఓజీ గంజాయి, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నుంచి డ్రగ్స్ ను తీసుకుంటున్న నందు సాయి, సాయి క్రిష్ణా లను పోలీసులు అరెస్టు చేశారు. లండన్ లో ఉన్న వంశి పై కూడా ఎక్సైజ్ పోలీసులు కేసును నమోదు చేశారు. దాడికి సంబంధించిన సంఘటన పై బాలానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.






