- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోదీ బీసీ వ్యతిరేక చర్యలను విడనడకపోతే దేశవ్యాప్త ఓబీసీ వ్యతిరేక ఉద్యమం
దేశవ్యాప్త ఓబీసీ వ్యతిరేక ఉద్యమం మొదలవుతుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

దిశ, హిమాయత్ నగర్: ప్రధాని నరేంద్ర మోదీ బీసీ వ్యతిరేక చర్యలను విడనడక పోతే , దేశవ్యాప్త ఓబీసీ వ్యతిరేక ఉద్యమం మొదలవుతుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 60 శాతానికి పెంచుతూ, మహిళ బిల్లులో ఓబీసీ సబ్ కోటా విధించాలని జాజుల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ లతో ఆగస్టు 7న బెంగళూరులో ఓబీసీ 11వ జాతీయ మహా సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం బషీర్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేష్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహాసభకు సంబంధించిన పోస్టర్ ను జాజుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రధాన డిమాండ్ తో భవిష్యత్ కార్యాచరణ ఉద్యమాన్ని ఈ మహా సభలో ప్రకటిస్తామని తెలిపారు.
వ్యతిరేక చర్యలు మానుకోకపోగే..
మహిళ బిల్లులో ఓబీసీలకు సబ్ కోటా లేకపోతే ఓబీసీ మహిళలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల అగ్ర వర్ణాలకే అధిక ప్రయోజనం చేకూరుతుందని , ఓబీసీలకు ఒరిగేది ఏమి లేదులేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ జనగణనలో ఓబీసీ కులాలను కూడా ఎస్సి , ఎస్టీల మాదిరిగా గుర్తించి లెక్కించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ బీసీ వ్యతిరేక చర్యలు మానుకోకపోగే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 7న బెంగళూరులో జరగనున్న జాతీయ ఓబీసీ మహా సభకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని... తెలంగాణ , ఏపీ , మహారాష్ట్రలకు చెందిన బీసీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీలతో పాటు 29 రాష్ట్రాల నుండి ఓబీసీ ప్రతినిధులు హాజరవుతారని జాజుల వివరించారు. బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, విక్రమ్ గౌడ్, శ్యాం కుర్మా, కవుల జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.






