- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారపనేనిపల్లి పాఠశాలకు మహర్దశ..దిశ కథనాలతో మారిన రూపురేఖలు
ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ పట్టుకున్నది. ఈ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థిని చదువుతున్న అంశంపై ‘దిశ’

ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ పట్టుకున్నది. ఈ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థిని చదువుతున్న అంశంపై ‘దిశ’ కథనాలు ప్రచురించడంతో ఆ స్కూల్ రూపురేఖల్ని మార్చివేశాయి. ఒక్కసారిగా ఆ పాఠశాల రంగుల హరివిల్లులా మారింది. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ప్రత్యేకంగా దృష్టి సారించి, స్కూల్ ఆవరణలోకి కోతులు రాకుండా సుమారు సోలార్ ఫెన్సింగ్, భవన గోడలతో పాటు ప్రహరీ, ప్రత్యేకంగా డ్రాయింగ్ ఆర్ట్స్‌తో తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో గత ఏడాది 4వ తరగతి చదివిన ఒకే ఒక విద్యార్థిని కీర్తన ఫొటోను పాఠశాల గోడపై డ్రాయింగ్ ఆర్ట్ వేయించడం విశేషం. మరో రూ.2లక్షలతో ఇతర సౌకర్యాలు, అభివృద్ధి పనులను పూర్తి చేశారు. రూ. లక్ష వ్యయంతో ‘వుయ్ కెన్ లెర్న్ ఇంగ్లీష్’ ల్యాబ్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యార్థులను ఉదయం తీసుకొచ్చి సాయంత్రం ఇంటి దగ్గర వదిలేందుకు సెవెన్ సీటర్ ఆటో ఏర్పాటుకు కలెక్టర్ ముందుకు వచ్చారు. గ్రామంలో జరిగిన బడిబాటలో కలెక్టర పాల్గొని తల్లిదండ్రులకు సౌకర్యాలు వివరించగా 11మంది చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా, వారికి అదనంగా ఓ ఉపాధ్యాయుడిని కేటాయించారు.
దిశ, వైరా : గత విద్యా సంవత్సరం ఆ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థిని విద్యను అభ్యసించింది. అయితే ఆ పాఠశాల దశను ‘దిశ’ దిన పత్రిక ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల లో ఒకే ఒక్క విద్యార్థిని చదువుతున్న అంశంపై 2024, న వంబర్ 26న ‘దిశ’ డైనమిక్ ఎడిషన్‌లో ‘ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి’, నవంబర్ 27వ తేదీన మెయిన్ ఎడిషన్‌లో ‘ఒకే ఒక్క విద్యార్థిని’ అనే శీర్షికలతో కథనాలను ప్రచురించింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. అధికారులు పలుసార్లు నారపనేనిపల్లి పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకుని రూ. 6లక్షలతో విద్యార్థులకు అవసరమైన మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో ఒక్కసారిగా ఆ పాఠశాల రంగుల హరివిల్లులా మా రింది. ‘దిశ’ కథనాలు ఆ స్కూల్ రూపురేఖల్ని మార్చివేశాయి.
గోడపై ఆ ఒక్క విద్యార్థిని ఫొటో..
పాఠశాలపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్కూల్ ఆవరణలోకి కోతులు రాకుండా సుమారు రూ. 1.50లక్షలతో సోలార్ ఫెన్సింగ్ వేయించారు. భవన గోడలతోపాటు ప్రహరీలను సుమారు రూ.1.50 లక్షలతో ప్రత్యేకంగా డ్రాయింగ్ ఆర్ట్స్‌తో తీర్చిదిద్దారు. పాఠశాలలో గత ఏడాది 4వ తరగతి చదివిన ఒకే ఒక విద్యార్థిని కీర్తన ఫొటోను పాఠశాల గోడపై డ్రాయింగ్ ఆర్ట్ వేయించడం విశేషం. మరో రూ.2లక్షలతో ఇతర సౌకర్యాలు, అభివృద్ధి పనులను పూర్తి చేశారు. రూ. లక్ష వ్యయంతో ‘వుయ్ కెన్ లెర్న్ ఇంగ్లీష్’ ల్యాబ్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగే విద్యార్థులను ఉదయం తీసుకొచ్చి సాయంత్రం ఇంటి దగ్గర వదిలేందుకు సెవెన్ సీటర్ ఆటోను ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ముందుకు వచ్చారు.
బడిబాట’లో కలెక్టర్ అవగాహన..
నారపనేనిపల్లి పాఠశాలలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధిస్తున్నారని వివరించారు. పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆరునెలల్లో విద్యార్థుల్లో స్పష్టమైన మార్పు వస్తుందని పేర్కొన్నారు. పాఠశాలపై తన ప్రత్యేక దృష్టి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే సుమారు 11 మంది విద్యార్థులు చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా ప్రస్తుతం ఉన్న టీచర్ ఉమా పావనితో పాటు మరో ఉపాధ్యాయుడు రాంబాబును కేటాయించారు. 20మందికి పైగా విద్యార్థులు చేరితే మూడో ఉపాధ్యాయుడిని కూడా కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.






