Mashrooms : పుట్టగొడుగులు రూ. 5 లక్షలు @హైదరాబాద్

by Muthe.Rajitha |

పుట్టగొడుగులు(Mashrooms) బయట సాధారణంగా వంద రూపాయలకు లభిస్తాయి.

Mashrooms : పుట్టగొడుగులు రూ. 5 లక్షలు @హైదరాబాద్
X

దిశ, వెబ్ డెస్క్ : పుట్టగొడుగులు(Mashrooms) బయట సాధారణంగా వంద రూపాయలకు లభిస్తాయి. ఇంకాస్త మంచి రకాలు అయితే రెండు మూడు వందల్లో దొరుకుతాయి. కాని రూ.5 లక్షల విలువ చేసే పుట్టగొడుగుల గురించి ఎపుడైనా విన్నారా? అవి ఎక్కడ లభిస్తాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో కొత్తగా వెలిసిన 'ఫుడ్ స్టోరీస్'(Food Stories) అనే ఆహారపదార్థాల మాల్ ఇపుడు నగరవాసులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 'ఫ్యూచర్ గ్రూప్స్'(Future Groups) కు చెందిన ఈ సూపర్ మార్కెట్లో దొరికేవాన్ని విదేశాల నుంచి తెప్పించిన ఖరీదైన ఆహార పదార్థాలే. అయితే ఈ మార్కెట్ కు ప్రస్తుతం ప్రధాన ఆకర్షణగా మారింది పుట్టగొడుగులు. దాదాపు 6 కిలోల బరువు ఉండే రేషి అనే పుట్టగొడుగు(Reishi Mahsrooms) ధర ఏకంగా రూ.5 లక్షలు. ఇక్కడికి వచ్చేవారు అంత ఖరీదైన మష్రూమ్స్ ను చూడటానికి ఎగబడుతున్నారు.

ఇది మాత్రమే కాదు ఇక్కడ ఒక కొబ్బరిబొండాం ధర వెయ్యి రూపాయలు, చాక్లెట్స్ ధర పదివేలు. ఇలా చెప్పుకుంటే పోతే అనేకం ఉన్నాయి. విదేశాలలో మాత్రమే దొరికే పండ్లు, కూరగాయలు, చేపలు, మష్రూమ్స్, మాంసం, స్వీట్లు, డ్రైఫ్రూట్స్, ఖరీదైన వాటర్ బాటిల్స్, చాక్లెట్స్ ఇంకా అనేకం ఉన్నాయి. వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు నిర్వహకులు. అలాగే ఇక్కడ స్పెషల్ కెఫే కూడా ఉంది. అప్పటికప్పుడు మీరు తాజా పండ్లు ఏరుకుంటే వాటితో జ్యూస్, స్మూతీలు తయారు చేసి ఇస్తారు. ప్రతి పదార్థానికి ఓ శాంపిల్ ఇస్తారట. అలాగే ఆయా దేశాల్లో పండించే కొన్ని ప్రత్యేక పంటలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారట. ఇంకా బోలెడు వింతలు ఉన్న ఈ స్టోర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Next Story