సికింద్రాబాద్ లో వ్య‌క్తి హ‌త్య‌

by Ratna Kumari |

సికింద్రాబాద్ లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న మోండా మార్కెట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ లో వ్య‌క్తి హ‌త్య‌
X

దిశ‌, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న మోండా మార్కెట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మోండా మార్కెట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని హ‌రిహ‌ర క‌ళాభ‌వ‌న్ స‌మీపంలో ఉన్న ఎన్టీపీసీ భ‌వ‌నంలో ఆదివారం రాత్రి టెర్ర‌స్ పై మ‌ద్యం సేవిస్తున్న స‌మ‌యంలో త‌లెత్తిన గొడ‌వ‌లో కూలీ పెద్ద న‌ర్సింహులును అత‌ని స్నేహితుడు ఉత్త‌మ్ మ‌ద్యం సీసాతో దాడి చేశాడు. దీంతో స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బ‌తుకుదెరువు కోసం బేగంపేట ఓల్డ్ క‌స్ట‌మ్స్ బ‌స్తీకి వ‌చ్చిన వీరిద్ద‌రూ కూలీలుగా ప‌ని చేస్తున్న‌ట్టు విచార‌ణ‌లో వెల్ల‌డి అయింది. ఈ ఘ‌ట‌న అనంత‌రం నిందితుడు ఉత్త‌మ్ పరారీలో ఉన్న‌ట్టు స‌మాచారం. అత‌ని కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story