- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీసీ నిర్ణయాలతో అధ్యాపకులకు తీవ్ర నష్టం : ఎంపీ ఆర్.కృష్ణయ్య
ఓయూ వీసీ కుమార్ నీరో చక్రవర్తి లా ప్రవర్తిస్తున్నారని ఎంపీ కృష్ణయ్య ఆరోపించారు.

దిశ, హిమాయత్ నగర్ : ఓయూ వీసీ కుమార్ నీరో చక్రవర్తి లా ప్రవర్తిస్తున్నారని ఎంపీ కృష్ణయ్య ఆరోపించారు. వీసీ నిర్ణయాల వల్లఅధ్యాపకులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీసీ మీ వైఖరి మార్చుకొని అధ్యాపకులకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల ఓయూలో నిర్వహించిన కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ (సీఏఎస్) ఇంటర్వ్యూలలో అన్ని అర్హతలు, ఏపీఐ స్కోర్లు యూజీసీ నిబంధనలను కలిగియున్న 47 మంది అధ్యాపకులను తిరస్కరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తిరస్కరించిన అధ్యాపకులను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులను ఎలాంటి కారణాలను చూపకుండా తిరస్కరించడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. అధ్యాపకుల కోసం పోరాడిన ప్రొఫెసర్ మనోహర్ ను సస్పెన్షన్చేయడం సరికాదన్నారు. తక్షణమే సస్పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీసీ కుమార్ నిర్ణయాల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ అధికారి ప్రతినిధి సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ విమర్శించారు. ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఓయూ అధ్యాపకులు పాల్గొన్నారు.






