- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పాపంలో నేనూ సహకరించా: Mp Arvind
తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అవడానికి తమ పాపం కూడా ఉందన్నారు. తన నాన్న 2004లో బీఆర్ఎస్‌కు రెండో, మూడో సీట్లు కాకుండా ఎక్కువ ఇచ్చి ఆ పార్టీని బతికించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను కూడా బీఆర్‌ఎస్‌కు సహకరించినట్లు చెప్పారు. కేసీఆర్ గద్దెనెక్కడంలో తమ పాపం కూడా ఉందని తెలిపారు. ఆ పాపం పోగొట్టుకునేందుకు తాను నిజామాబాద్‌లో కవితను ఓడించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కవితను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కేసీఆర్‌ను ఓడించేందుకు తాను ముందుంటానని అర్వింద్ తెలిపారు.
Next Story






