సుప్రీం ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం: ఎంపీ చామల

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-14 15:23:14  IST  )

సుప్రీం ఉత్తర్వలను స్వాగతిస్తున్నామని ఎంపీ చామల తెలిపారు..

సుప్రీం ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం: ఎంపీ చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్పెషల్‌ ఇంటిన్స్‌వ్‌ రివ్యూ పేరుతో భారత ఎన్నికల సంఘం చేస్తున్న దారుణాన్ని తాము ప్రశ్నించామని, ఒకవేళ 65 లక్షలు ఓటర్లను తొలిగించినట్లయితే ఎందుకు తీసేస్తున్నారో వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పిందని, ఈ ఉత్తర్వులను తాము స్వాగతిస్తున్నమని కాంగ్రెస్​ ఎంపీ చామల కిరణ్ కుమార్​ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని గురువారం ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో గడిచిన రెండు వారాలుగా ఎంపీలందరం ఈ స్పెషల్‌ ఇంటిన్స్‌వ్‌ రివ్యూపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుపడుతూ వస్తున్నామని ఎంపీ కిరణ్ కుమార్​ రెడ్డి తెలిపారు.

స్పీకర్‌ ఈ విషయంపై దృష్టి పెట్టకుండా సభను వాయిదా వేస్తూ వచ్చారని, సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో మన ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజా స్వామ్యంలో ఎన్నికల సంఘం అనేది ఒక కీలకమైన విభాగమని, రాజ్యాంగ బద్దంగా స్వతంత్రంగా పని చేయాల్సిన ఈ సంస్థ ప్రలోభాలకు లోనైతే తీరని నష్టం వాటిల్లుతుందని కిరణ్ కుమార్​రెడ్డి అన్నారు. పౌరసత్వం, మతం పేరున ఎన్నికల సంఘం ఓటర్లను తొలిగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఓటర్లను తొలిగించాలంటే ఎందుకు తొలిగించారో చెప్పాల్సి ఉంటుందన్నారు. రాహుల్‌ గాంధీ ఇటీవల ఇచ్చిన ప్రజంటేషన్‌ ద్వారా ఓటర్ల జాబితాలో లోపాలు సుస్పష్టంగా వెలుగులోకి వచ్చాయని, అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో చనిపోయిన వారిని బతికి ఉన్నట్లు, బతికి ఉన్న వారు చనిపోయినట్లు తప్పులు తడకలుగా జాబితా ఉందని కిరణ్​కుమార్​రెడ్డి అన్నారు. భారత్‌లో ఎన్నికల సంఘం చాలా స్పష్టతతో న్యూట్రల్‌గా పని చేయాల్సి ఉందని, సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్ఠం చేస్తున్నాయన్నారు.

Next Story