- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరాన్ని ముంచెత్తుతున్న వర్షం.. మూసారాంబాగ్ బ్రిడ్జి, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేత
శుక్రవారం ఉదయం నగరంలో జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసిన భారీ వర్షం.. సాయంత్రం మరోసారి ముంచెత్తింది.

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం ఉదయం నగరంలో జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసిన భారీ వర్షం.. సాయంత్రం మరోసారి ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమై.. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బేగంబజార్, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీవర్షానికి మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ వరద ప్రహిస్తుండటంతో పోలీసులు బ్రిడ్జిని మూసివేశారు. జంట జలాశయాలు నిండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి వరద నీటిని గేట్లు ఎత్తి విడుదల చేశారు. దీంతో ఉస్మాన్ సాగర్ నుంచి విడుదలైన వరదనీరు ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తోంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. వాహనదారులెవరూ అటువైపు రాకుండా బ్రిడ్జిపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. దిల్ సుఖ్ నగర్ వైపుగా వచ్చే వాహనాలను గోల్నాక న్యూ బ్రిడ్జి వైపు దారి మళ్లించారు. మరోవైపు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపైకి కూడా వరదనీరు చేరడంతో దానిని కూడా అధికారులు మూసివేశారు. ఇతర మార్గాల నుంచి వాహనదారులు తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు.






