- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raj Pakala : రాజ్ పాకాల ఇంటికి మోకిలా పోలీసుల నోటీసులు..
జన్వాడ ఫామ్ కేసులో మోకిలా పోలీసులు రాజ్ పాకాల ( Raj Pakala ) అలియాస్ పాకాల రాజేంద్ర ప్రసాద్ కు నోటీసులు జారీ చేశారు.

దిశ, శేరిలింగంపల్లి : జన్వాడ ఫామ్ కేసులో మోకిలా పోలీసులు రాజ్ పాకాల ( Raj Pakala ) అలియాస్ పాకాల రాజేంద్ర ప్రసాద్ కు నోటీసులు జారీ చేశారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒరియన్ విల్లాలో ఉన్న రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించేందుకు ప్రయత్నించిన పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగి అక్కడ ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అర్ధరాత్రి మోకిలా పోలీసులు ( Mokilla police ) ఒరియన్ విల్లాలోని రాజ్ పాకాల విల్లా నెంబర్ 40 వద్ద నోటీసులు ( police notices ) అంటించారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు మోకిలా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. సెక్షన్ 35(3)బీఎన్ ఎస్, ఎఫ్ ఐఆర్ నెంబర్ 311/2024 అండర్ సెక్షన్ 25, 27, 29 ఎన్డీపీఎస్ యాక్ట్ 1985, సెక్షన్ 3, 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు.






