- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాపారాలు, పరిశ్రమల అభివృద్ధికి ఆధునాతన వ్యూహాలు అవసరం
వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించేందుకు మార్కెటింగ్ విస్తరించడం, సేల్స్ పెంచుకోవడం, టీమ్ రెస్పాన్సిబిలిటీస్, క్యాష్ ఫ్లో ఇష్యూస్, ప్రాఫిటేబుల్ బిజినెస్ మోడల్, హై పర్ఫార్ టీమ్ నియమించుకోవడం తదితర అంశాలు ప్రధానమైనవని ప్రముఖ వ్యాపార అభివృద్ధి వ్యూహకర్త వేణు కళ్యాణ్ అన్నారు.

దిశ, హిమాయత్ నగర్: వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించేందుకు మార్కెటింగ్ విస్తరించడం, సేల్స్ పెంచుకోవడం, టీమ్ రెస్పాన్సిబిలిటీస్, క్యాష్ ఫ్లో ఇష్యూస్, ప్రాఫిటేబుల్ బిజినెస్ మోడల్, హై పర్ఫార్ టీమ్ నియమించుకోవడం తదితర అంశాలు ప్రధానమైనవని ప్రముఖ వ్యాపార అభివృద్ధి వ్యూహకర్త వేణు కళ్యాణ్ అన్నారు. యునిక్ లైఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘వ్యాపార రంగంలో ఎలా అభివృద్ధి సాధించాలి?’ అనే అంశంపై 'అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ' వర్క్ షాప్ హైదరాబాద్లోసోమవారం జరిగింది.
యునిక్ లైఫ్ ఆర్గనైజేషన్ సమన్వయకర్తలు సుశీల్ కుమార్ ఎర్రగుంట్ల, సతీష్ కుమార్ వనపర్తి, అర్చన నేతృత్వంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సర్వీస్, ఇండస్ట్రీస్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ మానేజ్మెంట్, ఎంఎస్ఏంఈ, రియల్ ఎస్ట్టేట్, నెట్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు చెందిన సుమారు 300 మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు హాజరయ్యారు.
ఈ వర్క్ షాప్ ను ఉద్దేశించి వేణు కళ్యాణ్ మాట్లాడుతూ వ్యాపార సందేహాలపై, వ్యాపార రంగాల్లో విజయాలు సాధించడానికి సరైన దిశానిర్ధేశం చేశారు. ప్రధానంగా వ్యాపార వృద్ధి వ్యూహాలలో కొత్త మార్కెట్లలోకి విస్తరించడం (మార్కెట్ విస్తరణ), కొత్త ఉత్పత్తులు లేదా సేవలను అభివృద్ధి చేయడం (ఉత్పత్తి అభివృద్ధి), ఉన్న మార్కెట్లలో అమ్మకాలను పెంచడం (మార్కెట్ వ్యాప్తి) కొత్త మార్కెట్ల కోసం కొత్త ఉత్పత్తులను సృష్టించడం (వైవిధ్యీకరణ)తోపాటు వ్యాపార కార్యకలాపాలు, సామర్థ్యం కస్టమర్ చేరువను మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను తెలిపుతూ, ఆర్గనైజేషన్ కల్చర్, వాల్యూస్ ఎలా క్రియేట్ చేయాలి, బిజినెస్ ఆటోపైలెట్ మోడ్ ఎలా పెట్టుకొవాలి తదితర అంశాలపై వేణు కల్యాణ్ మార్గనిర్ధేశం చేశారు. ప్రతిఒక్కరికి అర్ధమయ్యే విధంగా పూర్తిగా తెలుగులోనే జరిగిన ఈ వర్క్ షాప్ లో ‘బిజినెస్ నెట్ వర్కింగ్' ఉపయోగాల’పై గెస్ట్ స్పీకర్ బిజినెస్ నెట్ వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనాషా, ‘బిజినెస్ లీడర్ షిప్' అంశంపై ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు ఆర్. రవికుమార్ ప్రసంగించారు.






