- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్‌కు అదనపు సమయం ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ
ఎస్ఐఆర్ ప్రక్రియకు అదనపు సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ కోరారు. సోమవారం బీఆర్ఎస్ సర్ కో ఆర్డినేషన్ కమిటీ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడింది. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ద్వారా అర్హులైన వారి ఓట్లు పోకుండా చూడాలని అన్నారు...

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐఆర్ ప్రక్రియకు అదనపు సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ కోరారు. సోమవారం బీఆర్ఎస్ సర్ కో ఆర్డినేషన్ కమిటీ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడింది. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ద్వారా అర్హులైన వారి ఓట్లు పోకుండా చూడాలని అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీలో తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారని.. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియను పరిశీలించామని చెప్పారు. ఓటర్ మ్యాపింగ్ సరిగ్గా జరగలేదని.. ప్రజల్లోనూ అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఫామ్‌ల పంపిణీ అనుకున్న విధంగా లేదని తెలిపారు. ఇప్పటివరకు 37 శాతం మాత్రమే ఫారాలను నింపడం పూర్తయిందని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే విజ్ఞాపన పత్రాలు ఎన్నికల సంఘానికి ఇచ్చామని.. ఎస్ఐఆర్‌పై పూర్తిస్థాయిలో ఎన్నికల కమిషన్ రెడీగా లేదని అన్నారు. బీఎల్ఓలు నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.సతీష్‌రెడ్డి, కమిటీ సభ్యులు సుమిత్రానంద్, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.






