మీరాలం మండి మహాకాళేశ్వరం ఆలయంలో ఎమ్మెల్సీ కవిత బోనం

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad Bonalu)లో ఆషాఢ మాస బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

మీరాలం మండి మహాకాళేశ్వరం ఆలయంలో ఎమ్మెల్సీ కవిత బోనం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad Bonalu)లో ఆషాఢ మాస బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాస బోనాల వేడుకల సందర్భంగా.. హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలోని మీరాలం మండి శ్రీ మహాకాలేశ్వర ఆలయం(Meeralam Mandi Sri Mahakaleshwara Temple)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అలాగే నేడు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించారు.

అలియబాద్ దర్బార్ మైసమ్మ దేవాలయంలో కూడా కవిత బంగారు బోనం సమర్పించి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఆషాఢ మాస బోనాల వేడుకలు జూన్ 26న గోల్కొండ కోటలోని శ్రీ జగదంబిక అమ్మవారి ఆలయంలో బంగారు బోనంతో ప్రారంభమై, జూలై 24న చివరగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలతో ముగియనున్నాయి.

Next Story