కేసీఆర్‌కు ఎమ్మెల్సీ అలుగుబెల్లి లేఖ... ఆలస్యం.. అమృతం.. విషమంటూ..

by Disha Web Desk 18 |
కేసీఆర్‌కు ఎమ్మెల్సీ అలుగుబెల్లి లేఖ... ఆలస్యం.. అమృతం.. విషమంటూ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆలస్యం.. అమృతం.. విషం అన్న నానుడి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియనిది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ పై ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వారిని క్రమబద్ధీకరిస్తానని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారని, కానీ ఇంకెప్పుడు ఉత్తర్వలు జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. బహుశా వివిధ పనుల ఒత్తిడిలో ఉండి ఈ అంశంపై కేసీఆర్ దృష్టిసారించలేదనుకుంటానని సెటైర్లు వేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్ లెక్చరర్లుగా చేరేందుకు వీలుగా ఏప్రిల్ 1వ తేదీలోపు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story