ఎర్రగడ్డలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

by Kodari Anjali |

ఎర్రగడ్డలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్..

ఎర్రగడ్డలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
X

దిశ, జూబ్లీహిల్స్: ఎర్రగడ్డలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని నటరాజ్ నగర్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. ఎర్రగడ్డ, నటరాజనగర్ లో రూ.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సైడ్ కాలువ (సీవరేజ్) లైన్ పనులతో పాటు, రూ.86 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి కాలనీకి సమాన న్యాయం జరిగేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ప్రాంతీయ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Next Story