నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తా ; ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

by Ratna Kumari |

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం ఆసిఫ్ నగర్ లోని రాయల్ రీజెన్సీ ఫంక్షన్ హాల్ లో నాంపల్లి నియోజకవర్గం స్థాయి సమావేశం జరిగింది.

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తా ;  ఎమ్మెల్యే  మాజీద్ హుస్సేన్
X

దిశ‌, కార్వాన్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం ఆసిఫ్ నగర్ లోని రాయల్ రీజెన్సీ ఫంక్షన్ హాల్ లో నాంపల్లి నియోజకవర్గం స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ముఖ్యఅతిథిగా హాజరై 110 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ప్రభుత్వ పథక అమలుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ నగర్ ఎమ్మార్వో జ్యోతి, మాసబ్ ట్యాంక్ మెహదీపట్నం డిప్యూటీ కమిషనర్లు దశరథ్, శోభాశంకర్, విద్యుత్ శాఖ అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు.

Next Story