- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆడశిశువుకు జన్మనిస్తే వైద్యం ఫ్రీ.. హాస్పటల్‌ను ప్రశంసించిన ఎమ్మెల్యే

దిశ, ఎల్బీనగర్ : 'వెల్‌నెస్ హాస్పటల్'లో ఆడ శిశువుకు జన్మనిస్తే ఆ తల్లికి వైద్యం ఖర్చులను పూర్తిగా హాస్పటల్ యాజమాన్యమే భరిస్తూ ఉచిత వైద్యం అందించడం కోసం ముగ్గరు యువకులు అసద్, సుమన్, వివేక్‌లు కొత్త ఒరవడికి నాంది పలకడం అభినందనీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం హస్తీనాపురంలోని కొత్తగా ఏర్పాటు చేసిన 'వెల్‌నెస్ హాస్పటల్' ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేషంట్లు వస్తే వారి నుంచి ఫీజుల పేరిట ఎంతమొత్తం వసూలు చేయాలని చూసే ప్రైవేట్ హాస్పటళ్లకు ధీటుగా ఆడబిడ్డకు జన్మనిస్తే ఆ మహిళకు ఫ్రీగా వైద్యం అందించడం అభినందనీయమన్నారు. పేదలకు, రోగులుకు సేవ చేయాలనే తపన ఉన్న యువకులు, హాస్పటల్ నిర్వాహకులు అసద్, సుమన్, వివేక్‌లు మరింత మంది పేదలకు సేవ చేసేలా భగవంతుడు వారికి శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలకు ఇటువంటి సేవలు అవసరం కాబట్టి ఈ హాస్పటల్ మరింత విస్తరించి సేవలందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.