Breaking: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్‌‌కు పొన్నం ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌‌ను మంత్రి పొన్నం ఆహ్వానించారు..

Breaking:  తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి..  కేసీఆర్‌‌కు పొన్నం ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(Former CM KCR)తో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabakar) భేటీ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. సిద్దిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్‌(Siddipet Erravalli Farm House)కు వెళ్లి ఆయనను కలిశారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహం((Telangana Talli Vigraham)ను ఆవిష్కరిస్తున్నామని, తమరు తప్పకుండా రావాలని కేసీఆర్‌కు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ స్పందనపై సస్పెన్స్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా..? లేదా అనారోగ్య కారణాల వల్ల రాలేనని చెబుతారా అనే ప్రశ్నలు ఉత్కంఠతను రేపుతున్నాయి.

కాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటి ఈ విగ్రహానికి సంబంధించిన నమూనాను విడుదల చేశారు. గతంలో కేసీఆర్ ఆవిష్కరించిన విగ్రహం కంటే ప్రస్తుతం ప్రభుత్వం ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఆకర్షణీయంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అందరూ రావాలన ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్‌ను సైతం ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Next Story