- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి: మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ, తెలంగాణ బ్యూరో: తన తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేనని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చిందన్న అంశాన్ని విలేకర్లు మంత్రి ముందు లేవనెత్తారు. దీనిపై స్పంధించిన మంత్రి కోమటి రెడ్డి మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చిన విషయం తెలియదని చెప్పారు.
‘‘మాది జాతీయ పార్టీ. మాకో విధానం ఉంటుంది. అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను సీనియర్ ను, మంత్రి వర్గ సభ్యున్ని మాత్రమే. పార్టీ అధిష్టానం గుర్తించి నాకు మంత్రి పదవి ఇచ్చింది. మంత్రి పదవి కావాలని నేను అడుగలేదు. మంత్రి పదవి ఇచ్చేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని తెలుసుకుంటారని, తన ప్రమేయమేమి ఉండదు.’’ అని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. మంత్రి పదవి ఇస్తే సంతోషిస్తానని స్పష్టం చేశారు. మాది జాతీయ పార్టీ. పార్టీ గురించి మాట్లాడటానికి ఏమిలేదని చెప్పారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ దాని గురించి ఏమైనా మాట్లాడుతానని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు వచ్చే అన్ని విషయాలపై మాట్లాడుతామని, కేటీఆర్‌తో మాట్లాడటానికి ఏమిలేదని, ఆయనతో ఏం మాట్లాడుతామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కు అధికార పక్షంలో ఉన్నవారి కంటే ఎక్కువ బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. అసెంబ్లీకి రావడం లేదంటే ఆయనకు ప్రజల సమస్యల పరిష్కారం పట్లా చిత్తశుద్ధిలేదనేది వ్యక్తమవుతుందని చెప్పారు. కాళేశ్వరంపై చేసిన అవినీతి మరెక్కడ జరుగలేదని, దీనిపై విచారణ చేసిన ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెడుతామన్నారు. తాను పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చానని, అన్ని విజ్ఞప్తులను పరిశీలించి పనులు చేపట్టేందుకు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చాని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.






