- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
14న వాసవి కాలనీలో మెగా వైద్య శిబిరం
ఆర్ కె పురం డివిజన్ వాసవి కాలనీలో డిసెంబర్ 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్రముఖ సంఘ సేవకులు చిలుక ఉపేందర్ రెడ్డి తెలిపారు.

X
దిశ, చైతన్యపురి: ఆర్ కె పురం డివిజన్ వాసవి కాలనీలో డిసెంబర్ 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్రముఖ సంఘ సేవకులు చిలుక ఉపేందర్ రెడ్డి తెలిపారు. శిబిరానికి సంబంధించిన పోస్టర్ శనివారం ఆర్ కె పురంలో ఆవిష్కరించి మాట్లాడారు. వాసవి కాలనీ నివాసితుల సంఘం, దిల్ సుఖ్ నగర్ అగర్వాల్ శాఖ సమన్వయంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్ సి హెచ్ సాధురాం హాస్పిటల్, కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్, శ్రీ భగవాన్ మహావీర్ విక్లాంగ్ సహయ సమితి సహాకారంతో మెగా హెల్త్ క్యాంపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వాహకులు నరేష్ గోయల్, సంజయ్ కుమార్ గుప్తా, హరికిషన్ అగర్వాల్, కృష్ణారెడ్డి, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






