ఫుట్ పాత్ ను ఆక్రమించిన ‘మెడికవర్’

by Elthuri vijay kumar |

సికింద్రాబాద్ సంగీత్ కూడలి వద్ద ఉన్న మెడికవర్ ఆసుపత్రి బరితెగింపునకు పాల్పడుతోంది. ప్రభుత్వ స్థలంలో (ఫుట్ పాత్)ను సైతం ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేసి ఆసుపత్రి పార్కింగ్ కు వాడుతోంది.

ఫుట్ పాత్ ను ఆక్రమించిన ‘మెడికవర్’
X

ఫుట్ పాత్ ను ఆక్రమించిన ‘మెడికవర్’

- ఫుట్ పాత్ తొలగించి అక్రమ పార్కింగ్ కోసం ఏర్పాట్లు

- గతంలో లక్షలు వెచ్చించి ఫుట్ పాత్ నిర్మించిన జీహెచ్ఎంసీ

దిశ, బేగంపేట: సికింద్రాబాద్ సంగీత్ కూడలి వద్ద ఉన్న మెడికవర్ ఆసుపత్రి బరితెగింపునకు పాల్పడుతోంది. ప్రభుత్వ స్థలంలో (ఫుట్ పాత్)ను సైతం ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేసి ఆసుపత్రి పార్కింగ్ కు వాడుతోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రహదారుల వెడల్పు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.... రహదారి నిర్మాణంలో ఇండ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఇస్తుంది.మరో వైపు ఇలాంటి బడా కార్పోరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ స్థలాలను(ఫుట్ పాత్)లను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నాయి.సికింద్రాబాద్ సంగీత్ కూడలి వద్ద మెడికవర్ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రి ముందు గతంలో జిహెచ్ఎంసి నిర్మించిన ఫుట్ పాత్ ను తొలగించి ఆసుపత్రికి అణువుగా (పార్కింగ్ చేసుకునేందుకు) ర్యాంపును నిర్మించారు.ఈ దారి గుండానే నిత్యం వేల సంఖ్యలో వాహనాలు,పాదాచారులు నిర్విరామంగా వస్తూ పోతూ ఉంటారు.ఇలాంటి ప్రాంతంలో ఉన్న ఫుట్ పాత్ ను ఆక్రమించి ఆసుపత్రి అవసరాలకు వాడుకుంటున్నారు. గత 15, 16 సంవత్సరాలుగా ఈ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణ సామర్థ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏ భవనమైనా 3,4 సంవత్సరాలలో నిర్మాణం పూర్తి చేయాలి. అలాంటిది గత 15 సంవత్సరాలుగా నిర్మాణం జరిగి గత 2 నెలల క్రితం పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా నిర్మించడంతో నిర్మాణంలో నాణ్యత లోపం ఉండొచ్చని ... ఇది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారొచ్చని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో గజం 2,3 లక్షలకు పైఉంటుంది. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమేమిటని స్థానికులు నివ్వెరపోతున్నారు. ఈ విషయమై బేగంపేట్ సర్కిల్ మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణం అని మా దృష్టికివచ్చింది

- బేగంపేట్ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్

సంగీత చౌరస్తాలో ఉన్న మెడికేర్ ఆసుపత్రి వద్ద జిహెచ్ఎంసి(తాము )నిర్మించిన ఫుట్ పాత్ ను తొలగించి...ఆ స్థలాన్ని ఆక్రమించి వాహనాల నిలిపేందుకు అణువుగా ఫుట్ పాత్ ను ర్యాంపు గా నిర్మించారని మా దృష్టికి వచ్చింది...... పూర్తిగా ఎంక్వయిరీ చేసి ఆ నిర్మాణంపై చర్యలు తీసుకుంటాం.

ఆసుపత్రి వద్ద అక్రమంగా వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటాం: ట్రాఫిక్ పోలీసులు

మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉన్న ఫుట్ పాత్ స్థలంలో అక్రమంగా వాహనాలు నిలిపితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.

Next Story