- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ ప్రక్షాళనపై మేధా పాట్కర్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ సామాజిక, పర్యావరణ వేత్త మేధాపాట్కర్ మూసీ ప్రక్షాళనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సామాజిక, పర్యావరణ వేత్త మేధాపాట్కర్(Medha Patkar) మూసీ(Musi) ప్రక్షాళనపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్ లతో సమావేశమయ్యారు. మూసీ పునర్జీవం ప్రాజెక్టుతో ఇండ్లు కోల్పోయిన వారి విషయాలు, వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతుల గురించి కమిషన్ తో చర్చించారు. ఈసందర్భంగా కమిషన్ సభ్యులు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతు సంక్షేమ పాలన చేస్తున్నారని రైతులకోసం 2 లక్షల రుణమాఫీ, రూ. 500 బోనస్, రైతు భరోసా, ఆత్మీయ భరోసా లాంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
మూసీ రివర్ ప్రాజెక్టు(Musi River Front Project)లో ఇండ్లు కోల్పోయిన వారికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇతర భూములు, వ్యవసాయ భూములు కోల్పోయిన వారికీ ఆర్ధిక సాయం, భూమికి బదులు మరోచోట భూములు కేటాయించడానికి సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఫోర్త్ సిటీ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. మూసీ నది పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర సర్కార్ మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో చర్చలతో ముందుకెళ్లాలని, పేదలకు పునరావాసం కల్పించడంలో జాగ్రత్తలు పాటించాలని మేధాపాట్కర్ వారికి సూచించారు.






