అవినీతి నిరోధక శాఖ వలలో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారి మరో చేప

by Bhanu |

సికింద్రాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని అనుమతుల మేరకు నిర్మించిన వెంకట్ అనే యజమాని భవనాల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) ఇవ్వడానికి జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఎసిపి విఠల్ రావు రూ. 8లక్షలు లంచం డిమాండ్ చేశారు.

అవినీతి నిరోధక శాఖ వలలో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారి మరో చేప
X

దిశ, బేగంపేట : సికింద్రాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని అనుమతుల మేరకు నిర్మించిన వెంకట్ అనే యజమాని భవనాల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) ఇవ్వడానికి జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఎసిపి విఠల్ రావు రూ. 8లక్షలు లంచం డిమాండ్ చేశారు.నాలుగు లక్షలు మాత్రమే ఇస్తానని ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు. ముందుగా 4లక్షలు ఇస్తానని ఆదేప్రకారం ఏసిపి ప్రభుత్వ వాహనంలోనే నగదును ఇచ్చి దానిని విడియో రికార్డింగ్ చేసుకున్నాడు. తరువాత భవన యజమాని ఓసీ ఇవ్వమని అడుగగా మిగతా 4లక్షలు చెల్లిస్తేనే ఇస్తానని చెప్పడంతో తాను రికార్డింగ్ చేసిన వీడియోను ఎసిపికే పంపించి నాకు ఓసీని ఇవ్వకపోతే ఈ వీడియో ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంపిస్తానని హెచ్చరించారు.

దానికి భయపడక పోగా రెండు ఓసీలను ఏసిపి రిజెక్ట్ చేశాడు. వెంటనే బాధితుడు తమను సంప్రదించి పిర్యాదు చేయడంతో పాటు ఆధారాలను సమర్పించాడు అని హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీదర్ తెలిపారు. యజమాని పిర్యాదు పిర్యాదుతో శుక్రవారం రంగంలోకి దిగిన సికింద్రాబాద్ లోని అతడి జీహెచ్ఎంసీ కార్యాలయంతో పాటు అంబార్ పేట్ లోని నివాసంలో సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు, అక్రమాస్తుల గుర్తించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సోదాలు కొనసాగుతున్నాయని పూర్తి వివరాలు పూర్తిగా విచారణ జరిపిన తరువాత వెల్లడిస్తామని చెప్పారు.

Next Story