- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : హైదరాబాద్‌లో హాస్టల్స్‌పై భారీ టాస్క్ ఫోర్స్ దాడులు
హైదరాబాద్(Hyderabad)లో నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) టాస్క్ ఫోర్స్(Task Force) బృందాలు 58 హాస్టల్స్‌పై ఆకస్మిక తనిఖీలు(Rides on Hostels) నిర్వహించాయి.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) టాస్క్ ఫోర్స్(Task Force) బృందాలు 58 హాస్టల్స్‌పై ఆకస్మిక తనిఖీలు(Rides on Hostels) నిర్వహించాయి. ఖైరతాబాద్, ఎల్‌బీ నగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్‌లలోని హాస్టల్‌లలో ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ హాస్టల్‌లలో విద్యార్థులు, ఉద్యోగులు నివసిస్తుండగా.. అపరిశుభ్రమైన కిచెన్‌లు, నేలపైనే ఆహార పదార్థాల నిల్వ, బొద్దింకలు, ఎలుకల సమస్యలు వంటి సమస్యలు గుర్తించారు. అలాగే ఫుడ్ హ్యాండ్లర్లు, హెయిర్ క్యాప్‌లు, ఏప్రాన్‌లు ధరించకపోవడం.. గడువు ముగిసిన ఆహార పదార్థాల వినియోగం, కిటికీలకు ఇన్‌సెక్ట్-ప్రూఫ్ స్క్రీన్‌లు లేకపోవడం వంటి నిబంధనలు ఏవీ పాడించడం లేదని అధికారులు తెలిపారు.
GHMC అధికారులు, ఫుడ్ సేఫ్టీ(Food Safty) అధికారులు, మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో 30 హాస్టల్‌లకు నోటీసులు జారీ చేశారు. 5 హాస్టల్స్ కిచెన్‌లను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని హాస్టల్స్ కు GHMC చట్టం, 1955 ప్రకారం రూ. 2,45,500 జరిమానా విధించారు. హాస్టల్స్ యజమానులకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, నిర్లక్ష్యం వహిస్తున్నారని.. అలాంటి వారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. GHMC కమిషనర్ అమ్రపాలి ఆదేశాలతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.






