Crime News : ట్యాంక్‌బండ్‌పై భారీ దారి దోపిడీ.. వ్యాపారి నుంచి రూ.17 లక్షలు చోరీ

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad) నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌(TankBund)పై బుధవారం రాత్రి భారీ దారిదోపిడీ(Robbery) జరిగిన విషయం తెలిసిందే.

Crime News : ట్యాంక్‌బండ్‌పై భారీ దారి దోపిడీ.. వ్యాపారి నుంచి రూ.17 లక్షలు చోరీ
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad) నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌(TankBund)పై బుధవారం రాత్రి భారీ దారిదోపిడీ(Robbery) జరిగిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఓ వ్యాపారి రూ.17 లక్షలతో కారులో వెళ్తుండగా.. బైకుల మీద వచ్చిన దుండగులు, కారు ఆపి, కత్తితో బెదిరించి రూ.17 లక్షల నగదుతో పరారయ్యారు. ఈ హఠాత్పరిణామానికి వ్యాపారి తొలుత షాక్ గురై, తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు.. వ్యాపారి చెప్పిన వివరాలు, ట్యాంక్‌బండ్‌పై గల సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను గంటల వ్యవధిలోనే దోమలగూడ ప్రాంతంలో చాకచక్యంగా పట్టుకొని, వారి నుంచి నగదు రికవరీ చేశారు. కాగా నిందితులు వ్యాపారికి తెలిసిన వారేనని, అందువల్లే అంత ఖచ్చితంగా, రద్దీ ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు.

Next Story