తెలంగాణ జనసేనలో భారీగా చేరికలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-30 10:04:16  IST  )

తెలంగాణలో జనసేనకు రోజుకు రోజుకు బలంపుంజుకుంటోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నాయకత్వ లక్షణాలు పలువురిని ఆకర్షిస్తుండటంతో ప్రజలు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు...

తెలంగాణ జనసేనలో భారీగా చేరికలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో జనసేన(Janasena)కు రోజుకు రోజుకు బలంపుంజుకుంటోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) నాయకత్వ లక్షణాలు పలువురిని ఆకర్షిస్తుండటంతో ప్రజలు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ మేరకు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి(Janasena Party General Secretary Sri Ram Talluri) సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. స్వచ్ఛమైన రాజకీయాలకోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాజా సుజాత ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా శ్రీ రామ్ తాళ్లూరి ఆహ్వానించారు. ఇక నుంచి జనసేన బలోపేతం కోసం కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. తెలంగాణకు పవన్ కల్యాణ్ ఎన్నో చేస్తున్నారని, అందుకే జనసేనలో చేరామని స్పష్టం చేశారు.

జనసేన ట్వీట్

Next Story