- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీపీ జితేందర్ ను కలిసిన మార్వాడీలు
అగర్వాల్ సమాజ్, మార్వాడీలపై జరుగుతున్న విద్వేష ప్రచారం పై కఠిన చర్యలు తీసుకోవాలని అగర్వాల్ సమజ్ ప్రతినిధులు గురువారం

దిశ, సిటీ క్రైం: అగర్వాల్ సమాజ్, మార్వాడీలపై జరుగుతున్న విద్వేష ప్రచారం పై కఠిన చర్యలు తీసుకోవాలని అగర్వాల్ సమజ్ ప్రతినిధులు గురువారం డీజీపీ జితేందర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ వినతి పత్రంలో అగర్వాల్ సమాజ్ , మార్వారీలు బయటి వారు కాదని మేమంతా తెలంగాణ వాళ్లమని తెలిపారు. సికింద్రాబాద్, అమన్ గల్ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనల పై మా పై ఉద్ధేశ్యపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా విడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
మమ్మల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. మార్వాడీ, అగర్వాల్ సమాజ్ కుటుంబాలు శతాబ్దానికి పైగా తెలంగాణ లో ఉంటున్నామని వెల్లడించారు. ఇదే విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రాభివృద్ధిలో తాము కీలకంగా ఉన్నామని, స్వచ్ఛంద సేవలో భాగంగా అనేక దవాఖానలు, విద్యాసంస్ధలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ను నడిపిస్తున్నామని తెలిపారు. చాలా మంది ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని ప్రతినిధులు డీజీపీకి వివరించారు. గో బ్యాక్ అంటూ మాపై దాడి చేయడం సమంజసం కాదని వారన్నారు.






