- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..!
జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు అర్జున్ తల్లి, మేనమామ, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. బాలికలను ట్రాప్ చేయడంలో అర్జున్, ప్రవీణ్ సోదరులకు ఈ నలుగురు నిందితులు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నలుగురిని నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే అన్నదమ్ములు అర్జున్, ప్రవీణ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సోదరులు.. అమ్మాయిలను ట్రాప్ చేసి కార్లలో తిప్పుతూ లైంగిక దాడులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను ఉపయోగించి బాధితులను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడైంది.
అసలు ఏమి జరిగింది ..?
గుంటూరుకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ (అలియాస్ అర్జున్) చిన్నతనంలో తండ్రి మరణించాడు. తల్లి మీనా కుమారి, మేనమామ సంరక్షణలో పెరిగాడు. చంద్రశేఖర్ చేస్తున్న వికృత క్రీడల గురించి తల్లి, మేనమామకు తెలుసు. పలు మార్లు చంద్రశేఖర్ బాధిత అమ్మాయిల వద్ద నుంచి డబ్బును పలుమార్లు మీనాకుమారి బ్యాంక్ ఖాతాలో జమ చేసేవాడు. దీంతో తల్లి , మేన మామ ఇద్దరు అర్జున్ చేస్తున్న తప్పు పని నీ ఎప్పుడూ వేలెత్తి చూపక, సహాయం చేసేవారు. ఇద్దరు అన్నదమ్ములు ప్రధాన నిందితులు అర్జున్, ప్రవీణ్ పేర్లతో ఉన్న వీరు ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. అర్జున్ సోషల్ మీడియాలో ఎస్కార్ట్‌గా నటిస్తూ వీడియోలు పోస్ట్ చేసేవాడు. రిచ్ కిడ్స్ అమ్మాయిలను ఆకర్షించేలా కంటెంట్ తయారు చేసి, వారిని నమ్మించేవాడు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం చూపిస్తూ బాలికలను వలలో వేసేవారు. వారిని బయటకు తీసుకెళ్లిన తర్వాత కార్లలోనే లైంగిక దాడులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలను రహస్యంగా చిత్రీకరించి, ఆ వీడియోలతో బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఒక మైనర్ బాలిక నుంచి రూ.13 లక్షలు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రేమ పేరుతో మోసం
కార్లలో తిరుగుతున్న స్టైలిష్ ఫొటోలు, స్టార్టప్ పెట్టి కంపెనీ నిర్వహిస్తు న్నట్టు ప్రచారాలు.. ఇలా అమ్మాయిలను ఆకట్టుకునేందుకు చేయని స్టంట్లు లేవు. డబ్బు కోసం వలపు పనికి వెళ్లేందుకు వెనకాడడు. దారికి రాని అమ్మాయిలను ప్రేమ పేరుతో శారీరక సంబంధాలు పెట్టుకొని లక్షలు లాగుతాడు. ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. అతడి బారిన పడి మోసపోయిన బాధితులు ఇంకా ఉన్నారు. కానీ బయటకు రావడం లేదు. గత నెలలో బాలిక, మహిళతో పెళ్లి పేరుతో శారీరక సంబందాలు కొనసాగించి డబ్బు లాగి మోసం చేసిన కొండూరి చంద్రశేఖర్ ఆజాద్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డబ్బున్న అమ్మాయిలకే వల వేసినట్టు మోసాలు చేసినట్టు విచారణలో తెలుస్తోంది. చంద్రశేఖర్ ఆజాద్ కస్టడీ సోమవారం ముగుస్తుండడంతో నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారణ చేశారు.
డబ్బు సంపాదనే లక్ష్యం
తల్లి, మేనమామ సహాయం..
నిందితుడి తల్లి కోడూరి మీనా కుమారి బాధితుల నుండి ఆధారాలు , ఆర్ధిక లావాదేవీలు , తప్పుడు సాక్ష్యాలు సృష్టించటం లో నిందితుడికి సహాయపడేది. నిందితుడి మేన మామ తారక ప్రశాంత్ బాధితుల నుంచి డబ్బు వసూలు , బెదిరింపులకు పాల్పడటం , నిందితుడు స్నేహితుడు వినీల్ చౌదరి ( వినీల్ బాబు ) నేరాలకు పాల్పడటం , నిందితుడు అర్జున్ కు ఆర్దికంగా , కార్లను సమకూర్చడం, వీడియోలు తీయటం, మోసం చేయడంలో ప్లానింగ్ ఇచ్చేవాడు. జితేందర్ ( జితిన్) నిందితుడు అర్జున్ కి సోషల్ మీడియా లో బాధితులకు వల పన్నటం ఇతర కార్యకలాపాలో పాల్గొనేవాడు. ఎన్.హేమంత్ నిందితుడు అర్జున్ తో నేరాలు అమలు చెయ్యటం, బాధితులను ట్రాప్ చెయ్యటం, సాక్ష్యాలు సృష్టించటం చేసేవాడు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ఆజాద్ ( అర్జున్ ) ఏప్రిల్ 18 న అరెస్ట్ అయ్యాడు. కోడూరి రాజీవ్ , అలుగులి వాటి ఉదిత్ కార్తీక్ , 28 ఏప్రిల్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం కోడూరి మీనా కుమారి, తారక ప్రశాంత్ , జితేందర్ ( జితిన్) , వినీల్ చౌదరి ( వినీల్ బాబు ), ఎన్.హేమంత్ మరో ఐదుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు సరస్వతి , నిశాంత్, శ్రీజిత్ పరారీలో ఉన్నారు. ఈ హానీ ట్రాప్ లో 11 మంది నిందితులు పాల్గొన్నారు.






