నిధులు మంజూరు చేయాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కి విన‌తి

by Ratna Kumari |   (  Updated:2026-05-03 10:36:30  IST  )

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై వివిధ పార్టీల నాయకులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్  కి విన‌తి
X
దిశ‌, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై వివిధ పార్టీల నాయకులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదమ్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వల్లారపు శ్రీనివాస్ కుమార్, సీపీఐ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్, బీఎస్పీ ఇన్ చార్జి నర్సింగ్ రావు కలిసి సీతాఫల్ మండి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలకు మంజూరైన రూ.30 కోట్ల నిధులను విడుదల చేసి పనులను వెంటనే ప్రారంభించాలని వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా తార్నాకలోని విజయ డైరీ ప్రభుత్వ పాఠశాలను శాశ్వత భవనంలో పునరుద్ధరించాలని మంత్రిని కోరారు. వినతిని స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే హైదరాబాద్ కలెక్టర్‌ను ఆ ప్రాంగణాలను ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ఆదమ్ సంతోష్ కుమార్‌కు వివిధ పార్టీల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story