- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్: మల్లూరులో జ్వరాల కలకలం.. స్పందించిన అధికారులు
‘మంచంపట్టిన మల్లూరు డబుల్ బెడ్రూం కాలనీ’ అని దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి వైద్య, పంచాయతీరాజ్ అధికారులు స్పందించారు.

దిశ, మంగపేట : ‘మంచంపట్టిన మల్లూరు డబుల్ బెడ్రూం కాలనీ’ అని దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి వైద్య, పంచాయతీరాజ్ అధికారులు స్పందించారు. మూడు నాలుగు రోజులుగా కాలనీలోని ప్రతి ఇంటిలో ఒక్కరు లేదా ఇద్దరు జ్వరాల బారిన పడి ఆర్ఎంపీల వద్ద వైద్యం పొందుతున్న విషయాన్ని దిశ వెలుగులోకి తేవడంతో స్పందించిన వైద్య, పంచాయతీరాజ్ అధికారులు గురువారం డబుల్ బెడ్ రూం కాలనీలో ఇంటింటి ఫీవర్ సర్వే ఏర్పాటు చేశారు.
ఈ సర్వేలో రోగుల నుండి రక్త నమూనాలు సేకరించి ములుగు కమ్యూనిటీ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు తెలిపారు. పారా మెడికల్ సిబ్బంది కాలనీ, గ్రామంలోని మురికి కుంటల్లో క్లోరినేషన్ చేసి దోమలు, ఈగల లార్వా వృద్ధి చెందకుండా చర్యలు తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి అజ్మత్, సిబ్బంది గ్రామంలోని అన్ని వార్డుల్లో సైడు డ్రైనేజీలను శుబ్రం చేసి యాంటీ లార్వా స్ప్రేయింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్ పిచికారీ చేయించారు.
అనంతరం కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి జ్వర పీడితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు వైద్యురాలు యమున తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలు పరిసరాలు, వ్యక్తి గత శుబ్రత పాటించి, వేడి చేసిన నీటిని తాగి వేడి పదార్థాలు భుజించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






